: ఢిల్లీలో ముగిసిన పోలింగ్... కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
దేశ రాజకీయాలలో పెనుమార్పులు తీసుకొస్తామని కొందరు, బీజేపీ ఆధిపత్యానికి సవాల్ అంటూ మరి కొందరు విశ్లేషించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ బూత్ ల గేట్ లు మూతపడ్డాయి. అయితే, సాయంత్రం 6 గంటల సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారికి మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. మరి కాసేపట్లో, వివిధ మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను వెలువరించనున్నాయి. ఈ నెల 10వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది.