: ఒంగోలు ఎమ్మెల్యేకి తప్పిన ముప్పు
టీడీపీ యువ నేత, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ కు ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా టంగుటూరుకు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ట్రాక్టర్ ఢీకొన్నట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో కారు దెబ్బతినగా, జనార్థన్ క్షేమంగా బయటపడ్డట్టు సమాచారం. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లాలోని తూర్పునాయుడు పాలెం జనార్థన్ స్వస్థలం. గత ఎన్నికల్లో ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై 18 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బాలినేని వైఎస్ జగన్ కు బంధువన్న సంగతి తెలిసిందే. కాగా, జనార్థన్ తండ్రి దివంగత దామచర్ల ఆంజనేయులు మాజీ మంత్రిగా పనిచేశారు. జిల్లాలో టీడీపీ బలోపేతానికి కృషి చేసిన వారిలో ఆయన ఒకరు.