: ఆన్ లైన్ లో ఉపాధి హామీ పథకం నిధుల చోరీ
ఆధునిక కాలంలో ఇంటర్నెట్ సదుపాయం మరింత విస్తృతమయ్యాక ఆన్ లైన్ మోసాలు అధికమయ్యాయి. తాజాగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిధులను ఆన్ లైన్ లో ఓ హ్యాకర్ దొంగిలించాడు. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యాన, అటవీ శాఖలకు కేటాయించిన నిధులను హ్యాకర్ మళ్లించినట్టు తెలిసింది. విషయం గుర్తించిన వెంటనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బొలంగీర్ జిల్లాకు చెందిన పలువురు నకిలీ లబ్ధిదారుల ఖాతాలకు నిధులు బదిలీ అయినట్టు గుర్తించారు. ఇప్పటివరకు అక్రమంగా దాదాపు రూ.10 లక్షలు బదిలీ అయినట్టు చెబుతున్నారు. అయితే, ఆ ఆన్ లైన్ మోసగాడి పేరు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దానివల్ల అతడు అప్రమత్తమవ్వొచ్చని భావిస్తున్నారు.