: ఇంత నీచంగా ప్రవర్తిస్తారా?: కంటతడి పెట్టిన పొన్నాల
తాము శాంతియుతంగా నిరసన తెలుపుతూ గవర్నర్ ను కలిసేందుకు వెళుతుంటే అత్యంత ఘోరంగా పోలీసులను అడ్డుపెట్టి కేసీఆర్ సర్కారు తమను అడ్డుకుందని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు గట్టిగా అడ్డుకోవడంతో, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కిందపడ్డాడు. ఆయనను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్ పీఎస్ కు తరలించారు. తనపట్ల పోలీసులు నీచంగా ప్రవర్తించారని పొన్నాల కన్నీరు పెట్టుకున్నారు. భయంతోనే కేసీఆర్ తమ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు.