: కుంటి సాకుల వెంకయ్య మాటల్ని ఎవరూ నమ్మరు: కాంగ్రెస్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పే కుంటి సాకులను ప్రజలు నమ్మరని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. నేడు ఆయన రాజమండ్రిలో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా? అంటూ వెంకయ్యకు సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదో తెలపాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడతారా? అని రామచంద్రయ్య నిప్పులు చెరిగారు.