: ఉద్రిక్తంగా మారిన టీ.కాంగ్రెస్ 'చలో రాజ్ భవన్'... పలువురు నేతల అరెస్టు
అనుమతి ఇవ్వనప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాదులో గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలపాలన్న వారి కార్యక్రమాన్ని పోలీసులు మధ్యలోనే అడ్డుకుంటున్నారు. అనుమతి నిరాకరించినప్పటికీ పాదయాత్ర చేస్తుండటంతో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, దానం నాగేందర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు, రాజయ్య, బలరాం నాయక్ తదితర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ పలు పోలీస్ స్టేషన్ లకు తరలించారు. అటు, రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.