: క్యాన్సరుతో బాధపడుతున్న ఉత్తరాఖండ్ మంత్రి సురేంద్ర రాకేశ్ కన్నుమూత
ఉత్తరాఖండ్ రవాణా శాఖ మంత్రి సురేంద్ర రాకేశ్ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన భగవాన్ పూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో సురేంద్ర రాకేశ్ ను చికిత్స కోసం ముంబై లోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సంతాపం తెలిపారు.