: అనంతపురం జిల్లా సాకిరేవులో చిరుత దాడి... 15 గొర్రెలు మృతి


అనంతపురం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని కంబదూరు మండలం సాకిరేవులో గొర్రెలమందపై దాడి చేయడంతో 15 గొర్రెలు దాకా చనిపోయాయని తెలిసింది. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. గతంలోనూ జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరించిన చిరుతపులులు 70కి పైగా గొర్రెలను చంపాయి. తాజాగా, మరోసారి దాడి చేయడంతో చిరుతలను ఎలాగైనా బంధించి, అడవుల్లో వదిలిపెట్టాలని స్థానికులు అధికారులతో మొరపెట్టుకుంటున్నారు.

  • Loading...

More Telugu News