: భరద్వాజ మహర్షి సూత్రాలతో అదృశ్య విమానాల తయారీలో డీఆర్డీఓ!


విమానయానంపై 'బృహద్ విమాన శాస్త్ర' పేరిట భరద్వాజ మహర్షి రాసిన గ్రంథంపై ఆధారపడి అదృశ్య విమానాలను తయారు చేయవచ్చని, ఆ సాంకేతికతను అభివృద్ది చేసే యోచనలో ఉన్నామని డిఫెన్స్ రీసెర్చ్ అఫ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఏ)లో టెక్నాలజీ విభాగం చీఫ్ కంట్రోలర్ సతీష్ కుమార్ వ్యాఖ్యానించారు. గోవాలో జరుగుతున్న 'భారతీయ విజ్ఞాన సమ్మేళన్'లో సతీష్ ప్రసంగం అందరిలో కొత్త ఆలోచనలను రేపింది. అయితే, ఈ సాంకేతికత అభివృద్ధికి అన్ని విభాగాలు కలసి పనిచేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఇప్పటికే రాడార్లకు దొరకని స్టెల్త్ విమానాలను డెవలప్ చేసింది.

  • Loading...

More Telugu News