: 109 మంది బోకో హరామ్ తీవ్రవాదుల హతం


నైజీరియా-నైజర్ సరిహద్దు ప్రాంతంలో బోకో హరామ్ తీవ్రవాదులు, నైజర్ సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో 109 మంది మిలిటెంట్లతో పాటు నలుగురు సైనికులు కూడా మరణించారని నైజర్ ఆర్మీ అధికారి ఒకరి తెలిపారు. ఈ కాల్పులు శుక్రవారం జరిగాయని అధికారి వివరించారు. నైజర్ లోని బొస్సో, డిఫ్ఫా పట్టణాలపై బోకో హరామ్ తీవ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆ వెంటనే స్పందిచిన నైజర్-చాద్ సంయుక్త బలగాలు వారి కాల్పులను తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడు కూడా మరణించారని సమాచారం.

  • Loading...

More Telugu News