: ప్రేమపక్షులుంటే బయటకు రండి... వివాహం చేస్తాం!: హిందూ మహాసభ


ప్రేమికుల దినోత్సవం అంటూ పాశ్చాత్య ధోరణులు ప్రదర్శించవద్దని హిందూ మహాసభ హెచ్చరించింది. ఫిబ్రవరి 14న ప్రేమికులెవరైనా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే వారికి అక్కడికక్కడే పెళ్లిళ్ళు చేస్తామని స్పష్టం చేసింది. యువత పాశ్చాత్య సంప్రదాయాలను వీడాలని సూచిస్తూ, దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లోని మాల్స్, పార్కులు, చారిత్రక కట్టడాల వద్ద హిందూ మహాసభ బృందాలు ఉంటాయని, అక్కడికొచ్చే ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఇష్టమున్నవారికి అక్కడే పెళ్లి చేస్తామని హిందూ మహాసభ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌషిక్ తెలిపారు. ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేక దినం ఏదీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఏడాది పొడవునా ఇష్టమైన వారికి ప్రేమను తెలపవచ్చని, అయితే అది వీధుల వెంట, పార్కుల్లో కాకూడదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News