: రూ.699కే మైక్రోమ్యాక్స్ కెమెరా ఫోన్
భారత సెల్ ఫోన్ మార్కెట్లో నాణ్యత గల చౌక ధర సెల్ ఫోన్ జాయ్ ఎక్స్- 1800ను విడుదల చేసినట్టు మైక్రోమ్యాక్స్ వెల్లడించింది. బేసిక్ ఫోన్లు వాడే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దీన్ని తయారు చేశామని, 1.76 అంగుళాల స్క్రీన్, 750 ఎంఏహెచ్ బ్యాటరీ, 0.08 ఎంపీ కెమేరా, ఎఫ్ఎం రేడియో తదితర సదుపాయాలతో పాటు 4జీబీ వరకు మెమొరీ విస్తరించుకునే సౌకర్యం కలిగివున్న దీని ధర రూ.699 మాత్రమే అని పేర్కొంది. రెండో మోడల్ గా జాయ్ ఎక్స్- 1850లో కూడా ఇవే సదుపాయాలు ఉంటాయని, దీనికి 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ అదనపు ఆకర్షణ కాగా, రూ.799కి లభ్యమవుతుందని తెలిపింది.