: తండ్రయిన ధోనీ... పాపకు జన్మనిచ్చిన సాక్షి


టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రయ్యాడు. ధోనీ అర్ధాంగి సాక్షి శుక్రవారం నాడు ఓ పాపకు జన్మనిచ్చింది. గుర్గావ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. ధోనీ దంపతులకు ఇదే తొలి సంతానం. ఆ పాప 3.7 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఎప్పుడూ ధోనీ వెంటే క్రికెట్ టూర్లు వెళ్లే సాక్షి ఆస్ట్రేలియా టూర్ కు దూరంగా ఉంది. ధోనీ 2010 జులై 4న సాక్షిని వివాహమాడాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న ధోనీ తన కుమార్తెను చూసేందుకు ప్రత్యేక అనుమతితో స్వదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బహుశా పాకిస్థాన్ తో ప్రతిష్ఠాత్మక మ్యాచ్ అనంతరం ధోనీ భారత్ వచ్చేందుకు బీసీసీఐ అనుమతివ్వొచ్చని క్రికెట్ పండితులంటున్నారు.

  • Loading...

More Telugu News