: 75 శాతం హాజరు, ఉత్తీర్ణత ఉంటేనే బోధనారుసుము!


ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నిబంధనలను తెలంగాణ సర్కారు మరింత కఠినం చేసింది. అన్ని రకాలుగా అర్హత సాధించిన విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరేలా సర్కారు పటిష్ట చర్యలు చేపట్టనుంది. విద్యార్థులకు 75 శాతం హాజరు, పైతరగతికి వెళ్లేందుకు అర్హత ఉంటేనే ‘ఫీజు’ ఇవ్వాలని భావిస్తోంది. బోగస్ విద్యార్థులు, కాలేజీలకు చెక్ పెట్టేందుకు నిబంధనలను కఠినతరం చేసినట్టు అధికారులు తెలిపారు. కాలేజీల వారీగా విద్యార్థుల ఆధార్, ఈ-పాస్‌ తో అనుసంధానం చేయాలని, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరపాలని భావిస్తున్నట్టు వివరించారు. ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ‘ఫీజు’ పొందకుండా విద్యార్థులు, తల్లిదండ్రుల ఆధార్‌ ను కూడా తప్పనిసరి చేయాలన్న ఆలోచనతోనూ ఉన్నట్లు సమాచారం. విద్యార్థుల ఆధార్‌ కార్డులు, ఆదాయ పరిమితి, కులం, ఇతర ధ్రువీకరణ పత్రాలను ఎమ్మార్వోలు కచ్చిత సమాచారంతో ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, తప్పుడు సర్టిఫికెట్లను ఇచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

  • Loading...

More Telugu News