: పాతబస్తీలో 50 మందిపై రౌడీ షీట్లు నమోదు
పాతబస్తీలో బాలలపై నేరాలకు పాల్పడిన 50 మందిపై పోలీసులు రౌడీ షీట్లు తెరిచారు. పాతబస్తీలో కొద్ది రోజుల క్రితం వందలాది బాలకార్మికులకు పోలీసులు విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. బాలకార్మికులను చేరదీసిన పోలీసులు, పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో, దఫదఫాలుగా వారిని స్వస్థలాలకు పంపారు. పాతబస్తీలో పోలీసులు కనుగొన్న బాలకార్మికుల్లో 300 మందిని బీహార్ లోని వారి స్వస్థలాలకు తరలించినట్టు తెలిపారు.