: ఆన్ లైన్ లో ఆప్, బీజేపీ పోటా పోటీ


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మైకులు మూగబోయాయి. అధికారికంగా ప్రచారం ముగిసినప్పటికీ, ప్రచారం హోరు ముగియలేదు. పార్టీ నేతలు ప్రచారం ముగించి సేదదీరుతుండగా, కార్యకర్తలు, అభిమానులు ఆన్ లైన్ లో ప్రచారం కొనసాగిస్తున్నారు. హ్యాస్ ట్యాగ్ లతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. 'మఫ్లర్ మ్యాన్ సూపర్ మ్యాన్' అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ను కీర్తిస్తుండగా, 'పీఎం మోదీ, సీఎం బేదీ' అంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. లైకులు, షేర్లతో ఆ రెండు పార్టీల అభిమానులు ఆన్ లైన్లో ప్రచారం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News