: ఎన్టీఆర్ ఉదంతానికి, టీఆర్ఎస్ లో చేరికకూ మెలిక పెట్టిన తుమ్మల


తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాలను అనుభవించి, ఇటీవలే టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావుకు ఇంకా ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోలేదు. తాను పార్టీ ఎందుకు మారాననే విషయంపై ఇంకా వివరణలు ఇవ్వాల్సి వస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో, తెలంగాణలో టీడీపీ మనుగడ కష్టంగా మారిందని... అందుకే టీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆనాడు ఎన్టీఆర్ ను పదవి నుంచి తప్పించినా, ఈనాడు టీఆర్ఎస్ లో చేరినా అది ప్రజల కోసమే అంటూ సరికొత్త భాష్యం చెప్పారు. కార్యకర్తల అభీష్టం మేరకే టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు.

  • Loading...

More Telugu News