: యూఎస్ ట్రేడ్ పాలసీ సలహా కమిటీలో సభ్యుడిగా ఇండియన్-అమెరికన్ సీఈవో


భారత సంతత వ్యక్తి, ప్రముఖ ఇండియన్ అమెరికన్ సీఈవో అజయ్ బంగాను ప్రభుత్వంలో కీలక పదవిలో నియమించినట్టు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. ఈ మేరకు యూఎస్ ఇండియా బిజెనెస్ కౌన్సిల్ ఛైర్మన్ అయిన బంగా యూఎస్ ట్రేడ్ పాలసీ, నెగోషియేషన్స్ సలహా కమిటీలో సభ్యుడిగా నియమితులైనట్టు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. "ప్రతిభ, నైపుణ్యం కలిగిన ఇలాంటి వ్యక్తులు దేశానికి ఉత్తమమైన సేవ అందిస్తారు. వారి సేవకు నేను కృతజ్ఞుడిని. వారితో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను" అని ఒబామా పేర్కొన్నారు. అహ్మదాబాద్-ఐఐఎంలో ఎంబీఏ చేసిన బంగా... మాస్టర్ కార్డ్ సీఈవో, అధ్యక్షుడిగా చేస్తున్నారు. 2009 నుంచి ఆయన ఈ పదవుల్లో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News