: బయ్యారం స్టీల్ ప్లాంట్ కు అనుమతివ్వండి: కేంద్ర మంత్రి తోమర్ కు కేసీఆర్ వినతి
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య బయ్యారం స్టీల్ ప్లాంట్ అంశం ప్రస్తావనకు వచ్చింది. బయ్యారంలో ఉన్న అపార ఇనుము ఖనిజాన్ని వెలికితీసేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్, కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ నేపథ్యంలో, అక్కడే స్టీల్ ప్లాంట్ ను నిర్మించేందుకు అనుమతి మంజూరు చేయాలని ఆయన, తోమర్ ను కోరారు. కేసీఆర్ ప్రతిపాదనకు తోమర్ సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం.