: సిమెంట్ రేటు రూ.250కి తగ్గించండి... లేదంటే కఠిన చర్యలే: కంపెనీలకు ఏపీ మంత్రుల వార్నింగ్


సిమెంట్ బస్తాపై కంపెనీలు, వ్యాపారులు వసూలు చేస్తున్న అధిక ధరపై ఏపీ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ధరలను తగ్గించాలని ఏపీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, అచ్చెన్నాయుడులు కంపెనీలు, వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను సాయంత్రంలోగా అమలు చేయకుంటే కఠిన చర్యలు తప్పవని వారు కొద్దిసేపటి క్రితం హెచ్చరికలు జారీ చేశారు. ధరలు తగ్గించని కంపెనీలకు సర్కారు విడుదల చేసిన ప్రోత్సాహకాలను సైతం వెనక్కు తీసుకుంటామని మంత్రులు తేల్చిచెప్పారు. రూ.365 ధరకు విక్రయిస్తున్న సిమెంట్ బస్తాను రూ.250కే విక్రయించాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News