: తెలంగాణ ఎందుకు వచ్చిందా అనిపిస్తోంది: కోమటిరెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పాలన చూస్తుంటే తెలంగాణ ఎందుకు వచ్చిందా? అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పేపర్లకే పరిమితమవుతున్నాయని, అవి వాస్తవరూపం దాల్చడం లేదన్నారు. నల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమిలేదని ఆరోపించారు. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ హైదరాబాదులో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. సచివాలయం మార్చడం సరికాదని, ఇప్పుడున్న చోట సచివాలయం ఉండడంవల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని కోమటిరెడ్డి గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News