: నా బౌలింగ్ శైలిలో తప్పేమీ లేదు... బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చిందన్న ప్రజ్ఞాన్ ఓజా
హైదరాబాదీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్ శైలిలో ఎలాంటి పొరపాటు లేదని తేలిపోయింది. దీంతో అతడు తిరిగి రంజీ బరిలో దిగేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చిందని ప్రజ్ఞాన్ ఓజా తెలిపాడు. తన బౌలింగ్ శైలిలో ఎలాంటి పొరపాటు లేదని తెలుపుతూ బీసీసీఐ నుంచి తనకు మెయిల్ వచ్చిందని అతడు వెల్లడించాడు. ఓజా బౌలింగ్ తీరు అనుమానాస్పదంగా ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో అతడిని సస్పెండ్ చేసిన బీసీసీఐ, అతడి బౌలింగ్ శైలిని పలుమార్లు పరిశీలించింది. ఈ పరిశీలనలో అతడి బౌలింగ్ శైలిలో ఎలాంటి తప్పు లేదని రూఢీ అయ్యింది.