: ఏపీలో పెట్రోల్, డీజిల్ పై అదనపు పన్ను
పెట్రోల్, డీజిల్ పై అదనపు పన్ను వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన అదనపు పన్నుతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.4 పెరిగాయి. ఆర్థిక వనరుల్లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న ఆంధ్రాకు కొత్త ఆదాయం సమకూరాలంటే పెట్రోలు, డీజిల్, స్మార్ట్ ఫోన్లపై పన్నులు పెంచక తప్పదని వాణిజ్య పన్ను శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాజాగా సిఫార్సు చేసింది. పెట్రో ఉత్పత్తుల ధరలు నానాటికీ పడిపోతుండటంతో ఖజానాకు నెలకు రూ.103.27 కోట్ల ఆదాయం తగ్గిపోతోందని పేర్కొంది. ఈ లోటును భర్తీ చేయాలంటే డీజిల్ పై లీటరుకు రూ.2.05, పెట్రోలుపై రూ.4.41 పన్ను విధించాలని సిఫార్సు చేసింది. అటు రూ.10వేల పైబడిన స్మార్ట్ ఫోన్లపై ఇప్పుడున్న 5 శాతం వ్యాట్ ను 14.5 శాతానికి పెంచాలని సూచించింది. ఈ క్రమంలోనే పైవిధంగా ప్రభుత్వం పన్నులు పెంచినట్టు తెలుస్తోంది.