: చంద్రబాబు వరంగల్ పర్యటన రద్దు


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో చేపట్టనున్న యాత్రకు ఆదిలోనే బ్రేక్ పడింది. ఈ నెల 12న వరంగల్ లో జరగనున్న ఆయన పర్యటన రద్దైంది. వరంగల్ పర్యటనతో తెలంగాణలో యాత్రకు శ్రీకారం చుట్టాలని చంద్రబాబు సంకల్పించారు. ఈ మేరకు ఆయన పర్యటన రెండు రోజుల క్రితం దాదాపుగా ఖరారైంది. అయితే చంద్రబాబు పర్యటన రద్దైందని కొద్దిసేపటి క్రితం వార్తలు వెలువడ్డాయి. పర్యటన రద్దుకు దారి తీసిన కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News