: ఆయన జాబితాలో ఒక్క భారత పేసర్ కూడా లేడు!
క్రికెట్ ప్రపంచంలో విండీస్ బౌలింగ్ దిగ్గజం కోర్ట్నీ వాల్ష్ అభిప్రాయాలకు ఎంతో విలువ ఇస్తారు. తాజాగా, వరల్డ్ కప్ లో రాణిస్తారని భావిస్తున్న ఫాస్ట్ బౌలర్లతో వాల్ష్ ఓ జాబితా తయారు చేశాడు. ఒక్క భారత్ బౌలర్ కూ అందులో చోటు దక్కలేదు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్పీడ్ గన్ మిచెల్ జాన్సన్ కు అగ్రస్థానం లభించింది. తర్వాతి స్థానంలో సఫారీ స్టార్ డేల్ స్టెయిన్ ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా కీమార్ రోచ్, పాట్ కమ్మిన్స్, జెరోమ్ టేలర్, ఆండర్సన్, మలింగ, మోర్నీ మోర్కెల్, స్టీవెన్ ఫిన్, వెర్నాన్ ఫిలాండర్, జాసన్ హోల్డర్ ఉన్నారు. ఐసీసీ కోసం రాసిన కాలమ్ లో వాల్ష్ ఈ జాబితాను పేర్కొన్నాడు. కాగా, టీమిండియా పేసర్లలో అత్యధికులు గాయాలతో బాధపడుతుండడంతో టోర్నీ ప్రారంభం నాటికి జట్టులో ఎవరుంటారన్న విషయంలో అనిశ్చితి నెలకొంది.