: కాంగ్రెస్ లో ఆత్మశోధన... పార్టీ ప్రధాన కార్యదర్శులతో సోనియా, రాహుల్ భేటీ
వరుసగా ఎన్నికల్లో పరాజయాలను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత నిర్మాణం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు భేటీ అయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ భేటీలో... పార్టీ సంస్థాగత ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. వరుస ఓటములు, సీనియర్లు పార్టీని వీడుతుండడం వంటి పరిణామాలతో బెంబేలెత్తిపోతున్న కాంగ్రెస్ పార్టీ, నష్ట నివారణ చర్యలు చేపట్టింది. నేటి భేటీలో పార్టీ నేతల వ్యవహార సరళిపై రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.