: పెళ్లి కూతురైన గాయని శ్రేయా ఘెషాల్
బాలీవుడ్ ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ పెళ్లి కూతురైంది. తన స్నేహితుడు షీలాదిత్యను బెంగాలీ సంప్రదాయంలో వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపి, వివాహ ఫోటోను పోస్టు చేసింది. "నా జీవితంలో నేను ప్రేమిస్తున్న వ్యక్తిని నిన్న రాత్రి (5వ తేదీ) అందమైన బెంగాలీ సంప్రదాయ వివాహం చేసుకున్నా. ఈ వేడుకలో మా ఇరు కుటుంబాలు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మా జీవితంలో నూతన దశను ప్రారంభించబోతుండటంపై ఎగ్జైట్ అవుతున్నాం. నా భర్త షీలాదిత్య, నేను మీ నుంచి గుడ్ విసెష్ కోరుకుంటున్నాం" అని శ్రేయా వివరించింది.