: మచిలీపట్నంలో కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు... నలుగురు అనుమానితుల అరెస్ట్
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నగరంలోని పంబలగూడెం, టెంపుల్ కాలనీల్లో జరుగుతున్న ఈ సోదాల్లో భాగంగా ఇప్పటిదాకా పోలీసులు నలుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక సోదాల్లో పలు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన రిజిష్ట్రేషన్ పత్రాలు లేని కారణంగానే వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి వేళ భారీ సంఖ్యలో పోలీసుల రాకతో రెండు కాలనీల్లోని ప్రజలు భయాందోళనల్లో కూరుకుపోయారు.