: ఇరాక్ లో బందీలుగా ఉన్న కేరళ నర్సులకు విముక్తి... రేపు భారత్ కు రాక
ఇరాక్ లో ఉగ్రవాదుల చెరలో ఉన్న భారత మహిళలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఉపాధి నిమిత్తం ఇరాక్ వెళ్లిన 11 మంది కేరళ మహిళలు ఆ దేశంలోని కిరుక్కులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సులుగా పనికి కుదిరారు. ఈ క్రమంలో ఇటీవల ఆస్పత్రిపై దాడి చేసిన ఉగ్రవాదులు వారిని బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. అక్కడి భారత విదేశాంగ శాఖ ఉగ్రవాదులతో జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. దీంతో చెరబట్టిన 11 మంది కేరళ నర్సులను ఉగ్రవాదులు విడిచిపెట్టారు. ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించిన కేరళ నర్సులు ఇరాక్ లోని ఎర్బిల్ పట్టణం నుంచి రేపు భారత్ రానున్నారు.