: ఇక కార్యరంగంలోకి నీతి ఆయోగ్... నేడే తొలి భేటీ!
ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా రూపుదిద్దుకున్న ‘నేషనల్ ఇన్ స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా అయోగ్ (నీతి ఆయోగ్)’ ఇక కార్యరంగంలోకి దిగనుంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ తొలిసారిగా భేటీ కానుంది. దేశ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు రచించే గురుతర బాధ్యతలు అతికొద్ది మంది చేతుల్లోనే ఉన్నాయన్న కారణంతో ప్రణాళిక సంఘానికి చెల్లుచీటి ఇచ్చిన ప్రధాని మోదీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ఆర్థిక రంగ నిపుణులతో నీతి ఆయోగ్ కు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. నేటి నీతి ఆయోగ్ తొలి భేటీకి కేంద్రం నియమించిన ఆర్థిక రంగ నిపుణులతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు.