: గిరీశ్ సంఘీ ఇకపై బీజేపీ నేత!
మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త గిరీశ్ సంఘీ కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు పలికారు. అఖిల భారత వైశ్య మహా సమ్మేళన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయన తన మీడియా సంస్థ ద్వారా 'వార్త' దినపత్రికను ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన గిరీశ్ సంఘీకీ బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూశ్ గోయల్ ల నుంచి సాదర స్వాగతం లభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గిరీశ్ సంఘీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.