: ఆ చర్యలు గాంధీజీని షాక్ కు గురి చేసేవే!: ఒబామా సంచలన వ్యాఖ్య


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల భారత పర్యటనలో భాగంగా భారత్ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ఆకాశానికెత్తేశారు. అయితే నిన్న వాషింగ్టన్ లో చేసిన ప్రసంగంలో మాత్రం ఆయన భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ లోని మతపరమైన విద్వేషపూరిత చర్యలు ఆ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీని షాక్ కు గురి చేసేవే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ లోని భిన్నత్వంపై ప్రశంసలు కురిపిస్తూనే, వివిధ వర్గాల మధ్య నెలకొన్న విద్వేషాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ విశ్వాసాలను కాపాడుకునే క్రమంలో మరొకరి విశ్వాసాలు, సంస్కృతులపై దాడి చేయడం భారత్ లో పరిపాటిగా మారిందని ఒబామా అన్నారు.

  • Loading...

More Telugu News