: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం... ఇద్దరి మృతి: పత్తాలేని ట్రావెల్స్ యాజమాన్యం


ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన మరో బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద రాత్రి 12.45 నిమిషాలకు జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. మరణించిన వారిని బస్సు డ్రైవర్, క్లీనర్ గా గుర్తించారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళుతున్న కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు, టిప్పర్ ఢీకొన్న నేపథ్యంలో ప్రమాదం సంభవించింది. ప్రమాదం జర గిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. అయితే ఈ ప్రమాదంపై ట్రావెల్స్ యాజమాన్యం స్పందించిన పాపాన పోలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ట్రావెల్స్ కార్యాలయాలకు సమాచారం అందించారు. అయితే ఇప్పటిదాకా యాజమాన్యం అక్కడికి వచ్చిన దాఖలా లేదు. యాజమాన్యం స్పందించకపోవడంతో 5 గంటలకు పైగా ప్రయాణికులు నడిరోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. బస్సులోనే ప్రయాణికుల లగేజీ ఉంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు యాజమాన్యం లేకుండా లగేజీ బాక్సును తెరవడం కుదరదని చెబుతుండటంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News