: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం


ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమయ్యింది. వెయ్యి కోట్ల రూపాయల సమీకరణకు విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) కి డిస్కంలు ప్రతిపాదనలను అందజేశాయి. దీంతో విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యం కానుంది. డిస్కంలు అందజేసిన ప్రతిపాదనలపై ఈ నెలలో ఐదు ప్రాంతాల్లో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రభుత్వానికి ఈఆర్సీ సిఫారసు చేయనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం పెంచిన కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కాగా, ఈఆర్సీ ప్రతిపాదించిన ప్రకారం ప్రతి 50 యూనిట్ల లోపు విద్యుత్ వాడకానికి యూనిట్ కి 2.75 పైసలు వసూలు చేయనుంది. అలాగే 51 యూనిట్ల నుంచి 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడకానికి యూనిట్ కు 3.45 వసూలు చేయనుంది. విద్యుత్ వాడకం 101 నుంచి 150 యూనిట్ల వరకూ యూనిట్ కు 5.71 పైసలు వసూలు చేయనుంది. అదే 151 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వాడకానికి యూనిట్ కు 6.71 పైసలు వసూలు చేయనుంది. 201 యూనిట్ నుంచి 250 యూనిట్ల వాడకం వరకు 6.76 పైసలు వసూలు చేయనుంది. అదే వాడకం 251 నుంచి 300 దాటితే 7.29 పైసలు వసూలు చేయనుంది. విద్యుత్ వాడకం 301 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు 7.82 పైసలు వసూలు చేయనున్నారు. అలాగే 401 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకు 8.35 పైసలు వసూలు చేయనున్నారు. ఇక 500 యూనిట్ల పైబడిన విద్యుత్ వాడకానికి యూనిట్ కు 8.88 పైసల చొప్పున వసూలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News