: వరల్డ్ కప్ టీమిండియాదే: జవగల్ శ్రీనాథ్


2015 ఐసీసీ ప్రపంచ కప్ టీమిండియాదేనని భారత జట్టు మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, టీమిండియాలో అద్భుత ప్రతిభావంతులు ఉన్నారని అన్నారు. జట్టులో యువకులు అద్భుతాలు ఆవిష్కరించగల సమర్థులని ఆయన పేర్కొన్నారు. ధోనీ సారథ్యంలో మరోసారి టీమిండియా వరల్డ్ కప్ భారత్ కు తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్ఠంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బౌలర్లు వరల్డ్ కప్ లో రాణిస్తారని ఆయన తెలిపారు. బ్యాటింగ్ భారం టాపార్డర్ పంచుకుంటే టీమిండియా కప్ తో తిరిగొస్తుందని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News