: యూపీలో రాష్ట్రపతి పాలనకు మాయావతి డిమాండు!
అసమర్ధ సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని యూపీ సర్కార్ లో శాంతి భద్రతల సమస్యతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యూపీలో రాష్ట్రపతి పాలన నిర్వహించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు ఈరోజు ఆమె ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషిని రాజ్ భవన్ లో కలిసి ఓ మెమోరాండమ్ సమర్పించారు.
యూపీలో దోపిడీ, కిడ్నాప్ లతో బాటు మహిళలపై దురాగతాలు కూడా చోటుచేసుకుంటున్నాయని మాయ తన మెమోరాండమ్ లో పేర్కొన్నారు. వీటి విషయంలో బాధితులకు ఎలాంటి న్యాయం చేయకపోవడం, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు.