: ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం: నిర్మలా సీతారామన్
రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఏపీ సహా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఢిల్లీ మీడియాకు తెలిపారు. ఇదే సమయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడిన మంత్రి, రాజధానిలో స్థిరమైన ప్రభుత్వం అవసరమని అన్నారు. అందుకే బీజేపీకి పట్టం కట్టాలని చెప్పారు. బీజేపీతోనే సుస్థిరత, సుపరిపాలన సాధ్యపడతాయని ఉద్ఘాటించారు.