: స్వైన్ ఫ్లూ రోగులకు చికిత్సలు చేయలేం... మాస్కుల కొరతపై ‘రుయా’ వైద్యులు, నర్సుల ఆగ్రహం


తెలుగు రాష్ట్రాలను స్వైన్ ఫ్లూ వణికిస్తుంటే, ఆ వ్యాధికి చికిత్సలు అందిస్తున్న వైద్యులు, నర్సులను సర్కారీ ‘నాన్చుడు’ చర్యలు హడలుగొడుతున్నాయి. తక్షణమే మాస్కులు, మందులు అందించకపోతే చికిత్సలు చేయలేమని వైద్యులతో పాటు నర్సులు కూడా తేల్చి చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ రోగులకు చికిత్సలు అందించే సమయంలో ఫేస్ మాస్కులు తప్పనిసరి అని, అయితే సరిపడినన్ని మాస్కులను ప్రభుత్వం సరఫరా చేయడం లేదని తిరుపతిలోని రుయా వైద్య సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే, రోగులకు వైద్య సేవలను నిలిపివేస్తామని వారు హెచ్చరించారు. వైద్యులు, నర్సుల ఆందోళనల నేపథ్యంలో చికిత్సలు ఎక్కడ నిలిచిపోతాయోనని రోగులు, వారి బంధువులు హడలిపోతున్నారు.

  • Loading...

More Telugu News