: సీఎం చంద్రబాబును కలిసిన టాలీవుడ్ పెద్దలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టాలీవుడ్ ప్రముఖులు ఈ ఉదయం కలిశారు. ప్రముఖ నిర్మాతలు సురేశ్ బాబు, కేఎల్ నారాయణ, సీనియర్ డైరక్టర్ రాఘవేంద్రరావు తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. తుపాను బాధితుల కోసం తాము సేకరించిన రూ.11 కోట్ల మొత్తానికి సంబంధించి చెక్కును వారు ముఖ్యమంత్రికి అందజేశారు. కొన్నినెలల క్రితం సంభవించిన హుదూద్ తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, విశాఖపట్నం నగరం ఈ విలయం ధాటికి తీవ్రంగా నష్టపోయింది.