: రోడ్డు ప్రమాదాలపై ఏపీ సీఎం ఆరా... నివారణ చర్యలకు ఆదేశం


ఏపీలో నేడు చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలపై సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరా తీశారు. నేటి ఉదయం నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో మూడు ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఐదుగురు వ్యక్తులు చనిపోగా, 21 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాలపై సమాచారం అందుకున్న చంద్రబాబు, సంబంధిత శాఖాధికారులతో సమీక్షించారు. ప్రమాదాలు జరిగిన తీరుపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News