: జీహెచ్ఎంసీ సన్నాహాలు షురూ... నేటి టీఆర్ఎస్ ‘గ్రేటర్’ భేటీకి సీఎం కేసీఆర్


హైకోర్టు మొట్టికాయలు పడితే కాని తెలంగాణ సర్కారులో కదలిక రాలేదు. కోర్టు చీవాట్ల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా నేటి మధ్యాహ్నం అధికార పార్టీ టీఆర్ఎస్ గ్రేటర్ శాఖ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ స్వయంగా హాజరుకానున్నారు. భేటీలో భాగంగా గ్రేటర్ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్టు సమాచారం. అంతేకాక ఈ భేటీలో ఎన్నికల నిర్వహణపై కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశాలూ లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. మొన్నటి కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగానే ఉన్నాయి. కంటోన్మెంట్ తరహాలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధించి తీరతామన్న ధీమా అటు కార్యకర్తలతో పాటు ఇటు నేతాశ్రీల్లోనూ వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News