: గవర్నర్ ను కలసిన వామపక్ష నేతలు... ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి తరలింపుపై వినతిపత్రం
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను పది వామపక్ష పార్టీల నేతలు కలిశారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని వికారాబాద్ తరలించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించారు. ఇన్నాళ్లు అక్కడే ఉన్న ఆసుపత్రిని అకస్మాత్తుగా మరో ప్రాంతానికి తరలించడం సరికాదన్నారు. ఇలా చేయడంవల్ల ప్రజలకు మరింత ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ఈ మేరకు గవర్నర్ కు వారు వినతిపత్రం అందజేశారు. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో 100 అంతస్తులతో తెలంగాణ రాష్ట్రానికి కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే.