: కృష్ణా కరకట్ట ఆక్రమణలపై 27 మందికి నోటీసులు... చర్యలకు సీఆర్డీఏ కమిషనర్ కు ఆదేశం


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం నేపథ్యంలో భూ దురాక్రమణలను ఏపీ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. దురాక్రమణలను సహించేది లేదని ప్రకటించిన మరునాడే చర్యలకూ ఉపక్రమించింది. రాజధాని పరిధిలోకి వస్తున్న కృష్ణా కరకట్టలను ఆక్రమించిన దురాక్రమణదారులపై కొరఢా ఝుళిపించింది. దురాక్రమణదారులుగా నిగ్గు తేలిన 27 మందికి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే నేడు నోటీసులు జారీ చేశారు. కృష్ణా కరకట్టలను దురాక్రమించిన మీపై చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటూ ఆ నోటీసుల్లో కలెక్టర్ కోరారు. అంతేకాక కరకట్టలపై భూములను ఆక్రమించుకున్న మీరు ల్యాండ్ కన్వర్షన్ చేసుకోకుండా భవనాలను ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, కరకట్టలపై వెలసిన భవనాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News