: విశాఖలోని గోపాలపట్నంలో అగ్ని ప్రమాదం... కాలిబూడిదైన వైభవ్ షాపింగ్ మాల్
విశాఖ నగరంలోని గోపాలపట్నంలో నేటి తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వైభవ్ షాపింగ్ మాల్ ఉన్న బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో షాపింగ్ మాల్ కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. శరవేగంగా వ్యాపించిన మంటలు భవనంలోని మొదటి అంతస్తును పూర్తిగా దహించివేశాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఫైరింజన్ల సహాయంతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.