: పొన్నాలా, నీది నాలుకా? లేక తాటిమట్టా?: ఎమ్మెల్సీ కర్నె
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న సచివాలయం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసని... మంత్రులకు సరైన ఛాంబర్ లు కూడా లేవని... ఇలాంటి పరిస్థితిలో మంచి సచివాలయం కడతామన్న కేసీఆర్ వ్యాఖ్యలను పొన్నాల ఎందుకు తప్పుబడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడున్న సచివాలయం స్థలాన్ని కేసీఆర్ తన బంధువులకు కట్టబెడతారంటున్న పొన్నాలది... నాలుకా? లేక తాటిమట్టా? అని మండిపడ్డారు. పదవి పోతుందనే అభద్రతా భావంలో పొన్నాల ఉన్నారని ఎద్దేవా చేశారు.