: ప్రిన్స్ చార్లెస్ ను కలిసిన రాణిముఖర్జీ
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ లండన్ లో బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఓ చారిటీ డిన్నర్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రిన్స్ చార్లెస్ ను కలిశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ చార్లెస్, ఆయన అర్ధాంగి కెమిల్లా కూడా విచ్చేశారు. అమ్మాయిల రవాణాకు వ్యతిరేకంగా పోరాడే బ్రిటీష్ ఏషియన్ ట్రస్ట్ ఈ డిన్నర్ సందర్భంగా రాణీ ముఖర్జీని సన్మానించింది. అమ్మాయిల రవాణా కథాంశంగా వచ్చిన 'మర్దానీ'లో రాణీ ప్రధాన పాత్ర పోషించింది. అందులో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఈ కార్యక్రమానికి నోబెల్ విజేత కైలాష్ సత్యార్థి కూడా హాజరయ్యారు. కాగా, జనవరి 28న పోలెండ్ నగరం వార్సాలోని కినో మురానో థియేటర్లో 'మర్దానీ' ప్రీమియర్ షో వేశారు. పోలాండ్ వ్యాప్తంగా ఈ సినిమా ఫిబ్రవరి 5న విడుదల కానుంది.