: జోర్డాన్ పైలెట్ ను దహనం చేయడం ఐఎస్ అటవికతకు నిదర్శనం: ఒబామా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్ (ఐఎస్ఐఎస్) తాజాగా ఓ జోర్డాన్ పైలెట్ ను సజీవదహనం చేయడంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. విడుదల చేసిన వీడియో గనుక నిజమైనదే అయితే, అది ఐఎస్ఐస్ అటవికతను చాటేదేనని అన్నారు. "వీడియోలో చూపింది నిజమని తేలితే, అది వారి దుర్మార్గ బుద్ధికి, అటవికతకు సూచిక" అని పేర్కొన్నారు. ఈ సంస్థ కేవలం చంపడం, నాశనం చేయడంపైనే ఆసక్తి చూపుతోందని విమర్శించారు. ఐఎస్ గ్రూపు ఓటమి తథ్యమని, వారికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను కూడగట్టేందుకు అమెరికా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.