: రిజిస్ట్రేషన్ల ఆదాయం 80.69 శాతంగా నమోదు: మంత్రి కేఈ
జవనరి వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం 80.69 శాతంగా నమోదైందని ఏపీ ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. భూదాన్ బోర్డు రద్దుపై హైకోర్టు కేసులో ఇంప్లీడ్ అవుతామని చెప్పారు. అన్యాక్రాంతమైన గ్రామకంఠం భూములపై రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు ఉమ్మడి సర్వే చేస్తాయని, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై చట్టసవరణకు పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ భూముల వివరాలను ఆధార్ తో అనుసంధానిస్తామన్నారు.