: ఆ మ్యాచ్ 130 కోట్ల మందిని కట్టిపడేస్తుంది: షోయబ్ అక్తర్


వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ 130 కోట్ల మందిని కట్టిపడేస్తుందని అన్నాడు. చాలామందికి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వరల్డ్ కప్ కంటే ఎక్కువని తెలిపాడు. "ఆ టెన్షన్ భరించలేనిది. ఆటగాళ్లు రెట్టింపు శ్రమిస్తారు. మేం వరల్డ్ కప్ లో భారత్ పై ఎన్నడూ గెలవలేదు. దేవుడి దయ ఉంటే త్వరలోనే గెలుపు సాధ్యమవుతుంది" అని పేర్కొన్నాడు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అక్తర్ పైవిధంగా తెలిపాడు. ఇక, టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా భారత్-పాకిస్థాన్ వైరంపై స్పందించాడు. గత వరల్డ్ కప్ లో భారత్-పాక్ పోరు కారణంగా మ్యాచ్ కు ముందు రాత్రి నిద్ర లేదని తెలిపాడు. డ్రెస్సింగ్ రూంలో టెన్షన్ నెలకొని ఉండేదని అన్నాడు. కాగా, మ్యాచ్ నెగ్గిన రోజు రాత్రి కూడా ఆనందంతో నిద్ర రాలేదని పేర్కొన్నాడు. తాజా వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగనుంది. టోర్నీలో పోటీలు ఫిబ్రవరి 14న ఆరంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News