: 2017 వరకు పవన్ కల్యాణ్ ప్రశ్నించరట!
ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలంటూ ఊదరగొట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... తాను మాత్రం 2017 వరకు ప్రశ్నించనని స్పష్టం చేశారట. వివరాల్లోకి వెళ్లే, ఏపీ నూతన రాజధాని ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు పవన్ ను కలిశారు. తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, ప్రభుత్వం నుంచి వేధింపులకు గురవుతున్నామని... దీనిపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పవన్ ను రైతులు కోరారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్, 2017 వరకు తాను మాట్లాడనని, సరైన సమయంలో స్పందిస్తానని చెప్పి, రైతులను పంపించేశారట.